ITI Admissions: ఐటీఐ అడ్మీషన్లకు చివరి తేదీ ఇదే.. మెరిట్ ఆధారంగా సీట్లు
డోన్ టౌన్: 2024–25 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో మిగిలిపోయి న సీట్ల భర్తీ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐల జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 27వ తేదీలో గా వెరిఫి కేషన్ చేయించుకున్న వారికి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. 28న ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు, 30న ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
#Tags