Science Labs in Schools : సైన్స్ ల్యాబ్‌ల ఉపయోగాల‌పై అధికారులు ప‌రిశీల‌న చేయాలి..

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వాలు స్టెమ్‌ ల్యాబ్స్‌ మంజూరు చేశాయి.

రాయవరం: పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయుడు కృత్యాధార బోధన చేయాలి. ముఖ్యంగా సైన్స్‌ విద్యార్థుల్లో పరిశీలనాశక్తిని పెంచి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా బోధన చేయాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వాలు స్టెమ్‌ ల్యాబ్స్‌ మంజూరు చేశాయి. త్వరలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మరిన్ని స్టెమ్‌ ల్యాబ్స్‌ పాఠశాలలకు మంజూరు కానున్నాయి. పీఎంశ్రీ పాఠశాలలకు ప్రత్యేకంగా అటల్‌ ల్యాబ్స్‌ కూడా మంజూరు కానున్నాయి.

ITI Admissions : ఐటీఐల్లో రెండో విడ‌త ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

జిల్లాలో 45 అటల్‌ టింకరింగ్‌, 12 స్టెమ్‌ ల్యాబ్స్‌

ఉపాధ్యాయుడిని తరగతికి పరిమితం చేయాలన్న ఆలోచనలకు అనుగుణంగా ప్రయోగశాలలపై పర్యవేక్షణను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పెంచారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, స్టెమ్‌ ల్యాబ్స్‌, పాల్‌ ల్యాబ్స్‌ నిర్వహణ ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంది. పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగాలు ఎంతవరకు ఫలవంతమవుతున్నాయి? విద్యార్థులకు ప్రయోగాలు ఎంత మేర చేరుతున్నాయి? విద్యార్థులను ఎంత వరకు భాగస్వాములను చేస్తున్నారు? తదితర విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జిల్లా సైన్స్‌ అధికారి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 45 అటల్‌ టింకరింగ్‌, 12 స్టెమ్‌ ల్యాబ్స్‌, 30 పాల్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. గణితాన్ని సులువుగా విద్యార్థులకు అందజేసేందుకు గతంలోనే పాల్‌ల్యాబ్స్‌ను మంజూరు చేశారు.

PGCET State Ranker : పీజీసెట్‌లో రాష్ట్ర‌స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని..!

ప్రయోగాలను మరింత చేరువ చేసేందుకు

విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా చూసినప్పుడు మరింత అవగాహన పెంచుకోవడానికి అవకాశముంటుంది. తాను విన్న, చూసిన విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. అందుకే ముఖ్యంగా సైన్స్‌ బోధనలో ప్రయోగాలకు ప్రాధాన్యముంది. దీన్ని గ్రహించి గత ప్రభుత్వంలోనే సిమ్యులేషన్‌ విధానంలో ప్రయోగాలు ఏ విధంగా నిర్వహించాలి? అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించారు. గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు ప్రయోగాలపై ఇచ్చిన శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.

TS 10th Class Supplementary Results :టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా టాప్‌.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఎప్పుడంటే...

దీనికితోడు పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ను అందజేశారు. ఈ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా ప్రయోగాల నిర్వహణ విద్యార్థి మనసును మరింతగా హత్తుకుంటుంది. జిల్లావ్యాప్తంగా 486 మంది గణితం, 327 మంది ఫిజికల్‌ సైన్స్‌, 346 బయలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు సిమ్యులేషన్‌ విధానంలో శిక్షణ ఇచ్చారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్స్‌ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పీఎంశ్రీ పాఠశాలలకు సైన్స్‌ ల్యాబ్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ల్యాబ్‌ల పరిశీలన

పాఠశాలల్లో ఉన్న అటల్‌ టింకరింగ్‌, స్టెమ్‌, పాల్‌ ల్యాబ్స్‌ నిర్వహణ ఏ విధంగా సాగుతోందన్న విషయాన్ని పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. ల్యాబ్‌ల పరిస్థితి, ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగాలు, ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాఠశాలల్లో ఉన్న సైన్స్‌ ల్యాబ్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాలన్న సంకల్పంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

Students Academic Books : అధిక బ‌రువును మోస్తున్న విద్యార్థులు.. ఈ పాఠ్య‌పుస్త‌కాల‌తోనే బోధ‌న చేయాలి..

13 క్వాలిటీ ఇండికేటర్స్‌

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ పోర్టల్‌లో గత నెలకు సంబంధించి పాఠశాలలో చేసిన ప్రయోగాలు, యాక్టివిటీస్‌ను 15 రోజులలోపు అప్‌లోడ్‌ చేయాలి. ఆఫ్‌లైన్‌ క్యాష్‌బుక్‌ అండ్‌ లెడ్జర్‌ నిర్వహించాలి. ప్రతి విద్యార్థిలో డిజైన్‌ థింకింగ్‌ అభివృద్ధి చేయాలి. ఇచ్చిన కాంపొనెంట్స్‌ను ఒక క్రమపద్ధతిలో అమర్చాలి. సందేహాల నివృత్తికి ఏఎం పోర్టల్‌లో ప్రశ్నలు సంధించాలి. ప్రతి కాంపొనెంట్‌ రస్ట్‌ పట్టకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. అటల్‌ క్యాలెండర్‌ను మెయింటెన్‌ చేయాలి. ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ నిర్వహించే కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. అటల్‌ ల్యాబ్‌లో ఉన్న అన్ని టూల్స్‌ పనిచేయాలి. టైమ్‌టేబుల్‌లో తప్పనిసరిగా వారానికి రెండు పీరియడ్లు అటల్‌ ల్యాబ్‌కు కేటాయించాలి. ఒక అటల్‌ నోడల్‌ టీచర్‌ను నియమించాలి, ఆ టీచర్‌ తప్పనిసరిగా ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ అయి ఉండాలి. జిల్లాలో ఉన్న అటల్‌ టింకరింగ్‌, స్టెమ్‌, పాల్‌ ల్యాబ్స్‌ ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ సమీక్ష చేయనున్నారు.

Guest Lecturer Posts : మ‌హిళ అభ్య‌ర్థుల‌కు గెస్ట్ లెక్చ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ స‌బ్జెక్టుల్లోనే..

#Tags