IAS Officer Smita Sabharwal Inter Marks : వైరల్‌గా మారిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్ మార్క్ షీట్ ఇదే....
సాక్షి ఎడ్యుకేషన్: అతి చిన్న వయస్సులోనే యూపీఎస్సీకి సిద్ధమై తొలి ప్రయత్నంలో విఫలమైనా మరోసారి ప్రయత్నించి 4వ ర్యాంకును సాధించి చరిత్ర సృష్టించింది స్మితా సబర్వాల్. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన బెంగాల్ ఫ్యామిలీకి చెందిన స్మితా.. ఇలా తన ప్రయత్నాలతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అయితే, గత కొద్ది రోజులుగా తనుపై వస్తున్న విమర్శల గురించి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా విధులను నిర్వర్తిస్తున్న స్మితా సివిల్స్ సర్వీస్‌లో వికలాంగుల కోటా ఎందుకు అని ప్రశ్నించి తీవ్ర విమర్శలకు దారితీసేలా మారింది. ప్రస్తుతం, ఈ వార్తలు కొనసాగుతుండగానే స్మితా సబర్వాల్ ఇంటర్మీడియట్ మార్క షీట్ వైరల్‌గా మారింది.
➤ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సక్సెస్ జర్నీ...తొలి ప్రయత్నంలోనే..
➤ Good News for Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న బేసిక్ పే.. శుభవార్తను అందించిన కేంద్రం..!
ఇంటర్‌లో మార్కులు ఇలా..
ప్రాథమిక విద్యను హైదరాబాద్ సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో పూర్తి చేసింది. మరి తన 12వ తరగతి.. అంటే ఇంటర్మీడియట్‌లో మాత్రం తను అద్భుతంగా రాణించింది. దీంతో నేషనల్ వైడ్ అటెంషన్ క్యాచ్ చేసింది. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్‌లో 100కు 94 మార్కులు దక్కించుకుంది. ఎకనామిక్స్‌లో 100కు 90 మార్కులు, కామర్స్‌లో 86 ఇంకా అకౌంట్స్‌లో 97 సాధించింది.
➤ Smita Sabharwal, IAS : సక్సెస్ జర్నీ...ఈమె భర్త కూడా..