NAAS Exams for Students: విద్యార్థుల‌కు నాస్ ప‌రీక్ష‌లు

విద్య సామ‌ర్థ్యం గురించి ప‌రిశీలించేందుకు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష ఇది. ఈ ప‌రీక్ష‌కు వివిధ పాఠ‌శాల‌ల్లో నుంచి విద్యార్థుల‌ను ఎంపిక చేశారు. నాస్ ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ గురించి ప్ర‌భుత్వం పూర్తిగా వెల్ల‌డించారు..
Teacher explaining students in primary school

సాక్షి ఎడ్యుకేషన్‌: విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మరింత మెరుగుపడేలా విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు నిపుణులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలను సిద్ధం చేసి విద్యార్ధులకు అందిస్తున్నాయి. అభ్యసన సామర్థ్యం, స్థాయి మెరుగుకు ఉపాధ్యాయులకు సైతం అవసరమైన శిక్షణ ఇచ్చి బోధనా పద్ధతుల్లో వినూత్న మార్పులు తీసుకువచ్చాయి.

➤   Changes in H1-B Visa Process: మార్పులు ఇవే... ఎవరికి లాభమంటే

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యం ఏ మేరకు మెరుగుపడిందో తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో నవంబరు 3న కేంద్ర ప్రభుత్వ అసెస్‌మెంట్‌ సర్వే(ఎన్‌ఏఎస్‌), రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్‌ అసెస్‌మెంట్‌ సర్వే(ఎస్‌ఈఏఎస్‌) పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 675 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో 3,6,9 తరగతులు చదువుతున్న ర్యాండమ్‌గా గుర్తించిన 26,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

➤   Distance Education: దూర‌విద్య ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల తేదీ పొడగింపు..

పకడ్బందీగా పరీక్ష నిర్వహణ

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లుగా డిగ్రీ, డీఎడ్‌,బీటెక్‌ ,పీజీ విద్యార్థులు 1151 మందిని విద్యాశాఖ నియమించింది. ఈ పరీక్షను పర్యవేక్షించేందుకు బ్లాక్‌ కో ఆర్డినేటర్లుగా ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించింది.

➤   jobs for youth: యువతకు 1.80 లక్షల ఉద్యోగాలు ఎక్కడంటే..

విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు

నాస్‌ పరీక్ష నిర్వహణ వల్ల విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. విద్యాబోధన, అభ్యసన విషయాల్లో మార్పుచేర్పులు జరిగాయి.విద్యార్ధుల స్థాయి పెంపొందిచేలా బోధనలో వినూత్న పద్ధతులు, సాకేంతికత వచ్చాయి. ప్రస్తుతం విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష మంచి అవకాశం. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన విద్యా విషయక చర్యలు, మార్పులపై స్పష్టత వస్తుంది.

– లింగేశ్వరరెడ్డి, డీఈవో, విజయనగరం

#Tags