Gallup Global Workplace Report 2024: భారత్‌లో బాధపడుతూ పనిచేస్తోన్న ఉద్యోగులు.. రిపోర్టులో షాకింగ్‌ విషయాలు

భారత్‌లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్‌ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.

గల్లుప్‌ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు.

SEBI Grade-A Recruitment 2024: సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ. 44 వేలకు పైగా జీతం

ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.

నివేదికలోని వివరాల ప్రకారం..భారత్‌లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు.

నేపాల్‌ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.

TS LAWCET And PGLCET Results 2024: తెలంగాణ లాసెట్‌ ఫలితాలు.. ఇలా రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు

ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు.

#Tags