Free training courses: ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ

సింథియా: సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైం అండ్‌ షిప్‌ బిల్డింగ్‌(సెమ్స్‌) ఆధ్వర్యంలో సీడాప్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని 21 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

10వ తరగతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, ఐటీఐ ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, డిప్లమో, ఇంజినీరింగ్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్తీర్ణులైన వారు శిక్షణకు అర్హులు. ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్‌, మెకానికల్‌, మెకాట్రోనిక్స్‌ ఇంజనీర్‌, ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ ఇంజినీర్‌, కొరియర్‌ సూపర్‌వైజర్‌, వేర్‌హౌస్‌ ఎగ్జిక్యూటివ్‌, పిక్కర్‌, ఇన్వెంటరీ కంట్రోలర్‌, సీఎన్‌సీ ఆపరేటర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌ కోర్సుల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ అఫీసర్‌ కమాండర్‌ గోపీకృష్ణ శివ్వం తెలిపారు. 99481 83865, 77948 40934, 0891–2704010 నంబర్లకు సంప్రదించాలన్నారు.

చదవండి: Free Training Courses: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

#Tags