Free Training Courses: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
సంస్థ డైరెక్టర్ తాడి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నామన్నారు. దీనికి 19 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలై, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోగా www.rseti.in/online&application&rjy తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు తమ ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ వద్ద ఉన్న శిక్షణ సంస్థలో సంప్రదించాలని తెలిపారు. శిక్షణ అనంతరం రెండు ప్రభుత్వ సర్టిఫికెట్లతో పాటు, ఉచిత టూల్‌కిట్లు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 85559 88580, 90143 28803 ఫోన్ నంబర్లలోను, 8500 8550 63 వాట్సాప్ నంబర్‌లో సంప్రదించాలని శ్రీనివాసరావు సూచించారు.
Tags
- Free Training Courses
- Free training
- Free Training Courses at RSETIs
- Rural Self Employed Training Institute
- Union Bank of India
- Central Rural Development Departments
- computer courses
- Accounting Courses
- Photography Courses
- Cellphone Repair Courses
- Education News
- andhra pradesh news
- free training courses in andhra pradesh
- UnionBank
- TrainingInstitute
- CommunityDevelopment
- SkillDevelopment
- TrainingCourses
- Empowerment
- Sakshi Education Updates