Free Training DSC Candidates : వ‌చ్చేనెల 11 నుంచి డీఎస్సీ అభ్య‌ర్తుల‌కు ఉచిత శిక్ష‌ణ‌..! కావాల్సిన ధ్ర‌వ‌ప‌త్రాలు ఇవే..

ఏలూరు: డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వచ్చే నెల 11 నుంచి ఏలూరులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో వచ్చే నెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్హత, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.

Short Term Training : ఈ కోర్సుల్లో స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్‌ కింద నెలకు 1,500 చొప్పున రూ.3 వేలు, బుక్స్‌ అలవెన్స్‌ రూ. 1,000 చొప్పున అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు బీసీ స్టడీ సర్కిల్‌, కేరాఫ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంగ్లిష్‌ మీడియం యూపీ స్కూల్‌, వెన్నవెల్లివారిపేట, ఏలూరు, సెల్‌ 99123 94799, 83419 91001 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీక్స్‌తో లింక్‌.. జర్నలిస్ట్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

#Tags