Osmania University: ఓయూలో ఐదు ఎంఏ కోర్సులు రద్దు?

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో మరో 5 ఎంఏ కోర్సు లు రద్దు కానున్నాయి. పలు కోర్సులకు ప్రస్తుతం ఆదరణ కరువైంది.

విదేశీ భాషలకు ఇఫ్లూ వర్సిటీ, ఇతర రాష్ట్రాల భాష కోర్సులు అదే ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో ఓయూలో ప్రాధాన్యం తగ్గింది. దీంతో అధ్యాపకులు లేని కారణంగా ఎంఏ తమిళం, ఫ్రెంచ్, రష్యన్‌ కోర్సులను ఓయూ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Corporate Institutions: కార్పొరేట్ విద్య‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..!

గత కొన్నేళ్లుగా విద్యార్థుల ప్రవేశం లేని, అధ్యాపకుల కొరత ఉన్న మరో ఐదు కోర్సుల రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఎంఏ పర్షియన్, మరాఠీ, కన్నడ, అరబిక్, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో విద్యార్థులు చేరకుంటే రద్దు చేసే ఆలోచనలో అధికారులున్నారు. 

#Tags