SIPRI on Nuclear Weapons : వివిధ దేశాల్లోని అణ్యాయుధాల సంఖ్యపై సిప్రి నివేదిక..
ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. భారత్, పాకిస్థాన్ సహా 9 అణ్వస్త్ర దేశాలు గత ఏడాది తమ అణ్వాయుధాగారాలను ఆధునికీకరించాయని వివరించింది. కొన్ని దేశాలు సరికొత్త అణు సామర్థ్య ఆయుధ వ్యవస్థలను మోహరించాయంది. ఈ మేరకు వార్షిక ‘సిప్రీ ఇయర్ బుక్ 2024’ను జూన్ 17న విడుదల చేసింది. దీని ప్రకారం.. –2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయి.
H-1B Visa New Rules: సిద్ధమవుతున్న కొత్త రూల్స్.. మనవాళ్లపైనే ప్రభావం!
వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో భద్రపరిచారు. 3,904 అస్త్రాలను క్షిపణులు, యుద్ధ విమానాల్లో మోహరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 60 పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చైనా అణ్వాయుధాగారం పెరుగుతోంది. 2023 జనవరిలో ఆ దేశం వద్ద 410 అస్త్రాలు ఉండేవి. ఈ ఏడాది జనవరికి వాటి సంఖ్య 500కు పెరిగింది. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చు. వివిధ దేశాల్లో అణ్వస్త్రాల సంఖ్య.. అమెరికా 5,044, రష్యా 5,580, బ్రిటన్ 225, ఫ్రాన్స్ 290, చైనా 500, భారత్ 172, పాకిస్థాన్ 170, ఉత్తర కొరియా 50, ఇజ్రాయెల్ 90.
Global Startup Ecosystem: గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదిక.. టాప్ 10లో ఉన్న భారతదేశ నగరాలు ఇవే..
Tags
- nuclear weapons
- countries
- SIPRI Report 2024
- military storage centers
- International Intelligence Organization
- development of country
- SIPRI Year Book
- Army
- Current Affairs International
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Stockholm International Peace Research Institute
- nuclear weapons
- national security
- International relations
- Global defense strategies
- Strategic deterrence
- Global security perceptions
- Geopolitical stability
- Arms control
- SakshiEducationUpdates