Contract Posts: ఈనెల 11 నుంచి కాన్‌ట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న పోస్టుల‌కు ప‌రీక్ష‌లు..

మార్చిలో ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా ఎంపికైన అభ్య‌ర్థులకు ప్ర‌క‌టించిన తేదీ అనుసారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు..

ఖమ్మం: ఖమ్మంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన కొనసాగుతున్న లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మూడు పోస్టుల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన నాయమూర్తి జి.రాజగోపాల్‌ తెలిపారు. గత మార్చిలో ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, తిరస్కరించినవి పోగా మిగిలిన వారికి నైపుణ్యం, మౌకిక పరీక్షలు నిర్వహిస్తారు.

Environmental Awareness: విద్యార్థుల్లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి..

కాగా, ఆఫీసు అసిస్టెంట్‌ క్లర్క్‌ పోస్టుకు 11న, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెప్షనిస్ట్‌ పోస్టుకు 12న, ప్యూన్‌ అటెండెంట్‌ పోస్టుకు 13న పరీక్ష ఉంటుందని జిల్లా జడ్జి తెలిపారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందదని, జిల్లా కోర్టు అధీకృత వెబ్‌సైట్‌ లేదా న్యాయ సేవా సంస్థ కార్యాలయం నోటీసు బోర్డులో సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Social Welfare Hostels: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులకు ప్రోత్సాహించాలి..

#Tags