Skill Hub for Youth Employment: స్కిల్ డెవలప్మెంట్‌తో యువతకు ఉపాధి అవకాశాలు..
రాయచోటి టౌన్: స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్ ద్వారా యువత ఉపాధి పొందాలని రాయచోటి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శివశంకర్ పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర స్కిల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల యందు స్కిల్ హబ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్కిల్ హబ్ సెంటర్ ద్వారా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ టైలరింగ్ కోర్సు నందు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
SEBI Grade-A Recruitment 2024: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ. 44 వేలకు పైగా జీతం
శిక్షణ కాలం మూడు నెలలు ఉంటుందని, అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్(హౌసింగ్)కోర్సులో శిక్షణకు పది, ఐటీఐ డిప్లొమా చేసిన వారు, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ టైలరింగ్ కోర్సుకు ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నేరుగా రాయచోటి పాలిటెక్నిక్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9550104260/ 9381069980కు ఫోన్ చేసి వివరాలు తెలుపవచ్చునన్నారు.
School Admissions: విద్యార్థి ‘ప్రైవేటు’ బాట..! ఈ తరగతి నుంచే చేరికలు ఏక్కువ..