Science Conference : రేపు ఏపీటీఎఫ్ ఆధ్వ‌ర్యంలో విద్యా వైజ్ఞానిక స‌ద‌స్సు..

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌ 1938) ఆధ్వర్యంలో జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించనున్నారు.

తిరుపతి: తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌ 1938) ఆధ్వర్యంలో జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించనున్నారు. ఏపీటీఎఫ్‌ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.రమేష్‌, ఎస్‌.సురేష్‌ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Join our WhatsApp Channel (Click Here)

School Inspection : సిల‌బ‌స్‌ను స‌కాలంలో పూర్తి చేయాలని డీఈఓ ఆదేశం..

ఈ సదస్సులో విద్యావ్యవస్థలో సంస్కరణలు–ప్రాథమిక విద్యపై చూపుతున్న ప్రభావాలు, సుదీర్ఘ ప్రస్థా నంలో ఉపాధ్యాయ ఉద్యమం–ఉపాధ్యాయు ల పాత్ర, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఏపీటీఎఫ్‌ కృషి అనే అంశాలపై
Follow our YouTube Channel (Click Here)
చర్చించడంతోపాటు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.

Teachers: ‘సర్కారు’లో టీచర్ల కొరత.. తాత్కాలిక పద్ధతిలో భర్తీ

ఈ సదస్సుకు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా విద్యాశాఖాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.

Follow our Instagram Page (Click Here)

 

జిల్లాలోని ఏపీటీఎఫ్‌ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మేధావులు హాజరై ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Join our Telegram Channel (Click Here)

#Tags