Schools and Colleges Holidays : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూల్స్‌.. కాలేజీల‌కు సెల‌వులు.. ?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.
Due to rain schools and colleges holidays news

ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 

స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల ఇచ్చే ఆలోచ‌న‌లో..?

ఈ నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ సెల‌వుల విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. దాదాపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడురోజులు సెప్టెంబ‌ర్ 4, 5, 6 తేదీల్లో( సోమ‌,మంగ‌ళ‌, బుధ‌) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. 

కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్‌ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు ఇవ్వ‌డం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ‌లో 2023-24 అకడమిక్ ఇయర్‌లో ప‌రీక్ష‌లు- సెల‌వులు ఇవే..

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

ఏపీలో కూడా..

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. ఇంకా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విద్యాశాఖ అధికారులు స్కూల్స్ సెల‌వుపై ఇంకా స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. 

జూలై నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాలకు దాదాపు స్కూల్స్‌, కాలేజీల‌కు 10రోజులు వ‌ర‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా సెప్టెంబ‌ర్ నెల‌లో కురిసే ఈ భారీ వ‌ర్షాలకు కూడా స్కూల్స్‌,కాలేజీల‌కు సెలవులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు భారీగానే వ‌చ్చాయి. ఈ సెల‌వులు కార‌ణంగా ఉపాధ్యాయులు మాత్రం సిల‌బ‌స్‌ను టైమ్‌కు పూర్తి చేయడంలో ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా.. 

రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP2  వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో ఈ ఏడాది (2023-24) సెల‌వులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

#Tags