DK Shivakumar felicitates 10th Toppers: పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్.. అంకితకు రూ.5 లక్షల పురస్కారం

బెంగళూరు: పదో తరగతిలో 625 మార్కులకు 625 మార్కులు సాధించిన 'అంకిత'ను నటుడు రిషబ్ శెట్టితో పాటు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా ప్రశంసించారు. స్టేట్ టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

అంకితకు రూ. 5లక్షల పురస్కారం
10వ తరగతి పరీక్షలో 625/625 మార్కులు సాధించిన బాగల్‌కోట్‌కు చెందిన అంకితను మంగళవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సన్మానించారు. అంతే కాకుండా ఆ విద్యార్ధి ప్రతిభకు మెచ్చి ప్రోత్సాహక బహుమతిగా రూ.5 లక్షలు ప్రదానం చేశారు.

అంకితను మాత్రమే కాకుండా మండ్య విద్యార్థి నవనీత్‌ను కూడా డీకే శివకుమార్ సత్కరించి.. ప్రోత్సాహక బహుమతిగా రూ.2 లక్షలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

 

#Tags