Diwali Holiday Cancel : బిగ్ షాకింగ్ న్యూస్‌.. దీపావళి సెలవు సోమ‌వారం రద్దు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం దీపావళి పండ‌గ‌కు సెల‌వు తేదీని న‌వంబ‌ర్ 13వ తేదీకి (సోమ‌వారం) మారుస్తు కీలక నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెల్సిందే.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ దీపావళి పండుగకు ఈ ఆదివారం సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. న‌వంబ‌ర్ 13వ తేదీన (సోమవారం) దీపావళి సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌ర్ 13వ తేదీన‌ వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణ తరగతులు ఉన్నాయని, ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు సజావుగా నిర్వహించలేమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరాకరిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

పండితులు దీపావళిని నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం నిన్న సెలవులను కూడా మార్పులు చేశారు. ఈ మేరకు నవంబర్ 13వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా దీపావళి సెలవు దినం మునుపటిలా నవంబర్ 12వ తేదీ..  ఐచ్ఛిక సెలవు నవంబర్ 13న ఇవ్వబడింది. ఇప్పుడు దీన్ని సవరించి నవంబర్ 13ని దీపావళికి సాధారణ సెలవుగా మార్చారు. ఈ విధంగా, పండుగ తర్వాత రోజు నవంబర్ 14 నుంచి ప్రత్యామ్నాయ సెలవుదినం అమలులోకి వస్తుంది. 

విద్యార్థులు అయోమయంలో..

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల వారాంతపు సెలవులు లభించాయి. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 11వ తేదీ రెండో శనివారం సెలవు. మరుసటి రోజు ఆదివారం కావడంతో నవంబర్ 12న సెలవు ఉంటుంది. ఇప్పుడు దీపావళి సెలవుల సందర్భంగా నవంబర్ 13న కూడా సెలవు ఇచ్చారు. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

☛ November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌చ్చే సెల‌వులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..

కానీ తెలంగాణ ప్రభుత్వం న‌వంబ‌ర్ 13వ తేదీన‌ ఇచ్చిన సెలవుదినంగా కాకుండా కేంద్రం ఎన్నికల సంఘం 12న సెలవుదినంగా ప్రకటించడంతో ఆశక్తి కరంగా మారింది. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. న‌వంబ‌ర్ 13వ తేదీన‌ పరిస్థితి ఏంటని ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సెలవు ప్రకారం న‌వంబ‌ర్‌ 12న సెలవులు అయిపోతాయి కావున 13న అంటే సోమవారం నుంచి స్కూళ్లకు యధావిధిగా వెళ్లాల్సిందే మరి.

 Constable posts: పదో తరగతి అర్హతతో వేలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్‌ ఎప్పుడంటే..

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజు సెలవిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సెలవిస్తే ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సెలవుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం..
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం న‌వంబ‌ర్ 13వ తేదీన (సోమవారం) దీపావళి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సోమ‌వారం సెల‌వు ఉంటుంది.

 Due to Heavy Rain Schools and Colleges closed : నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు బంద్‌.. ఎక్క‌డంటే..?

#Tags