Digital education: డిజిటల్‌ విద్యాబోధనకు అనువుగా ట్యాబ్‌ల పంపిణీ

దివ్యాంగులకు

  • దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
  • భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ, ఆరోగ్య పరిరక్షణ
  • ఉచితంగా ఉపకరణాల పంపిణీ
  • చదువు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం
  • డిజిటల్‌ విద్యాబోధనకు అనువుగా ట్యాబ్‌ల పంపిణీ
  • నెలనెలా ఠంచన్‌గా పింఛన్‌ అందజేత
  • నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

చ‌ద‌వండి: Open Degree Exams: 9 నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

డిజిటల్‌ బోధన
శారీరక వైకల్యంతో బాధపడుతూ తోటి పిల్లలతో సమానంగా చదువుకోలేక తల్లడిల్లే చిన్నారుల బంగారు భవిత కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక యాప్‌లతో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. జిల్లాలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 119 మంది వినికిడి, దృష్టిలోపంతో బాధపడే విద్యార్థులు, 54 మంది ఐఈఆర్టీలు, ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న 36 మంది ప్రత్యేక ఉపాధాయులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేశారు. వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులందరూ ట్యాబ్‌లు వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచారు.

#Tags