Sheikh Molvi Noorullah Munir: పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు విలువ లేదు

తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు.
పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు విలువ లేదు

పవిత్రమైన షరియా చట్టాల ప్రకారమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబతుల్లా అఖుంద్‌జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్‌ మోల్వీ నూరుల్లా మునీర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్‌ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్‌ పేర్కొన్నారు.

#Tags