Farming: రైతుగా మారిన లెక్చరర్‌..

పంట పండించడం ఎంతో ఇష్టమైన పని. అందుకని ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని సాగిస్తున్నారు ఈ డిగ్రీ కళాశాల లెక్చరర్‌. అసలు ఇతని కథేంటి..? ఏ పంట పండించారు..? ఈ కథనాన్ని పరిశీలించండి..

బళ్లారి: పొలం ఉండి పంటలు సాగు చేసి వర్షాభావంతో నష్టపోయి వ్యవసాయం వద్దనుకుంటున్న తరుణంలో కాలం తెల్సిన ఓ లెక్చరర్‌ వ్యవసాయాన్ని పండుగా చేస్తున్నారు. ఉద్యోగంతో పాటు వ్యవసాయాన్ని కూడా ఎంతో మక్కువతో చేస్తూ లాభాలు గడిస్తున్న ఓ ఆదర్శ రైతు విజయగాధ ఇది. బాగల్‌కోట జిల్లా బాగల్‌కోట తాలూకా బెనకట్టి గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ హనుమంతు తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన 40 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

Ninth Class Admissions: ఈ రెండు జిల్లాల్లో తొమ్మిదో తరగతికి దరఖాస్తుల ఆహ్వానం..

మిశ్రమ పంటలతో లాభాలు :

ఈ రైతు వినూత్న పద్దతిలో వ్యవసాయం చేయడంతో మిరపలో లాభాలు గడించారు. ఈ ఏడాది ఏడు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా పెట్టుబడి పోను రూ. 6 లక్షలు లాభం వచ్చినట్లు తెలిపారు. చెరకు పంటను 7 ఎకరాల్లో సాగు చేయగా మంచి ఆదాయం వచ్చిందని, ఒకే పంటను నమ్ముకుని సాగు చేస్తే నష్టాలు వస్తాయని, మిశ్రమ పంటలు సాగు చేయాలని చెబుతున్నారు. ఇక వ్యవసాయ ఆధారిత భూమిలో కూడా 50 క్వింటాళ్ల తెల్లజొన్నలు, శెనగ 50 క్వింటాళ్ల పంట పండటంతో ఖర్చులు పోను రూ. 4 లక్షలు ఆదాయం వచ్చిందని, చెరకులో రూ.12 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Current Affairs: మార్చి 21వ తేదీ కరెంట్ అఫైర్స్.. పోటీ పరీక్షలకు ఉపయోగపడే వార్తలు ఇవే!

మొత్తం మీద ఈ ఏడాది తమ పొలంలో వ్యవసాయంలో వర్షాధారిత, నీటి పారుదల వసతి కలిగిన భూముల్లో ఖర్చులు పోను దాదాపు రూ.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. తాను డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నానని, తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని, ఎవరో ఏదో పంటలు చెబితే వాటిని పెట్టకుండా అధ్యయనం చేసి పంటలు సాగు చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయని ఈ లెక్చరర్‌ తన అనుభవంతో చెబుతున్నారు.

 

                 

 

#Tags