Degree Admissions 2024: డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాశీబుగ్గ: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కళాశాల శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ డీఆర్‌ జె.వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

Degree Students: సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లల్లో డీబారైన విద్యార్థులు..

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థులు కళాశాల వద్దకు వచ్చి దరఖాస్తులు పొందవచ్చునని అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అని సూచించారు. పూర్తి వివరాల కోసం 08945293642, 8639539082, 9490638480, 9490809289 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags