Space Week 2024 : రేపటి నుంచి స్పేస్ వీక్ - 2024.. వివిధ కార్యక్రమాలతో..
తిరుపతి: తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 17న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ నూతనంగా ప్లానిటోరియం ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు కో–ఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ సోమవారం తెలిపారు. అలాగే చంద్రుడిపై మానవుడు కాలుమోపిన సందర్భంగా వారం రోజుల పాటు స్పేస్ వీక్ – 2024 జరుపుతున్నామని.. ఈ వారం రోజులూ విద్యార్థులతో పాటు సందర్శకులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్త ప్లానిటోరియం ప్రారంభం అనంతరం ‘అంతరిక్షం – ఖగోళ శాస్త్రం’పై ఓపెన్ హౌస్ సైన్సు క్విజ్ పోటీలు ఉంటాయన్నా రు.
18న 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ‘అంతరిక్షం – ఖగోళ శాస్త్రం’పై కోల్లెజ్ మేకింగ్ పోటీలు, 19న మోటారుతో నడిచే గ్లైడర్‌పై వర్క్ షాప్ జరుగుతుందన్నారు. ఇందులో ఆసక్తి గల 7 నుంచి పదో తరగతి విద్యార్థులు రూ.200 చెల్లించి వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. 20వ తేదీన పిల్లల కోసం చంద్రుడిని అర్థం చేసుకోవడంపై వర్క్‌షాప్ ఉంటుందని.. నాలుగు నుంచి ఆరో తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని.. రిజిస్ట్రేషన్ రుసుం లేదని.. కత్తెర తీసుకురావాలన్నారు. 21న ‘చంద్రుని వలసరాజ్యం’ అనే అంశంపై పోస్టర్ పెయింటింగ్ పోటీ లు ఉంటాయన్నారు. ఇందులో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.
రాకెట్, శాటిలైట్ మోడల్ పోటీలు జరుగుతాయని.. ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. 22వ తేదీన ‘అంతరిక్షం – ఖగోళ శాస్త్రం’ అంశంపై ఇంటర్ స్కూల్ టీమ్‌వైజ్ క్విజ్ పోటీలు ఉంటాయని.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని.. ఒకే పాఠశాల నుంచి ఒక బృందంలో ఇద్దరు ఉండాలని తెలిపారు. 23న చంద్రునిపై ల్యాండింగ్, అభివృద్ధి చెందుతున్న ఉత్సుకత, సవాళ్లు, అవకాశాలపై పాపులర్ సైన్స్ లెక్చర్ ఉంటుందన్నారు. చివరగా బహుమతుల ప్రదానం ఉంటుందని.. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
GATE Exam 2025 : ఫిబ్రవరి 2025లో గేట్.. దీని స్కోర్‌తోనే ఎంటెక్, పీహెచ్‌డీతోపాటు పీఎస్‌యూ జాబ్స్!