Collector Gautami: సెంట్రల్‌ వర్సిటీలో పనులు చేపట్టండి

అనంతపురం అర్బన్‌: కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్సిటీ)లో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ గౌతమి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల అంశంపై కలెక్టర్‌ శుక్రవారం తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. విశ్వవిద్యాలయ మ్యాప్‌ను పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన పనుల వివరాలు, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ప్రహరీ నిర్మాణం సగంలోనే ఎందుకు నిలిచిపోయిందో కారణాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుని మిగిలిన పనులు రెండు రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. యూనివర్సిటీలో 33 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

చ‌ద‌వండి: AP Govt Schools: ఉపాధ్యాయులూ జాగ్రత్త!

#Tags