Bill Gates On AI Impact On Software Engineers: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏం చెప్పారు?

చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.

ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు.  

IT Companies Layoffs: ఐటీలో కోతలకాలం.. కొనసాగుతున్న లేఆఫ్స్‌, కొత్త రిక్రూట్‌మెంట్స్‌ లేనట్లే..

కామత్ పాడ్‌కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్‌ నిఖిల్ కామత్‌తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ముప్పు లేదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్‌తోపాటు యూఎస్‌లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు.

ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ  అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.

Freshers Hiring In IT Sector Slow Down:  ఇబ్బందుల్లో ఐటీ రంగం.. భారీగా తగ్గిన నియామకాలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనూ నిరాశే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు.

#Tags