BCI Bars These Law Colleges: ఈ కాలేజీల్లో అడ్మీషన్స్‌ రద్దు చేస్తూ బీసీఐ నిర్ణయం.. ఏపీకి చెందిన 2 కాలేజీల్లోనూ..

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న న్యాయ కళాశాలలపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(BCI) కఠిన చర్యలు తీసుకుంది. ఏపీలోని లా కాలేజీలు సహా దేశ వ్యాప్తంగా నిబంధనలను అతిక్రమించి నడుపుతున్న ఏడు లా కాలేజీలపై BCI నిషేధం విధించింది.

TS EAMCET Counselling Postponed: రేపట్నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ వాయిదా.. కారణమిదే!

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ కాలేజీల్లో ఈ ఏడాది(2024-25) ప్రవేశాలను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది. బీసీఐ చర్యలు తీసుకున్న కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 2 లా కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఒకటి అనకాపల్లిలోని షిరిడిసాయి న్యాయ కళాశాల కాగా, మరొకటి తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ లా ఉన్నాయి. 

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిషేధం విధించి లా కాలేజీలు ఇవే...

1. H.S లా కాలేజ్‌(ఎతహ్,ఉత్తరప్రదేశ్‌
2. మాస్టర్‌ సోమనాథ్‌ లా కాలేజ్‌ (జైపూర్‌, రాజస్థాన్‌)
3. శ్రీ క్రిష్ణ కాలేజ్‌ ఆఫ్‌ లా( బాగ్‌పత్‌, మీరట్‌)
4. శ్రీ ఈశ్వర్‌ రెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ లా (తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌)
5. శ్రీ షిర్డి శ్రీ విద్యా పరిషత్‌, శ్రీ షిర్డీసాయి లా కాలేజ్‌ (విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌)
6. ఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ లా(అలీఘడ్ జిల్లా, మన్పూర్ కలాన్ ఖైర్)
7. తేజుసింగ్ మెమోరియల్ లా కాలేజ్ (శబల్‌పూర్, జేపీనగర్)

#Tags