Ayodhya Ram Mandir Inauguration Update 2024 : జనవరి 22న స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇప్ప‌టికే.. పలు రాష్ట్రాల్లో జ‌న‌వ‌రి 22వ తేదీ స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెలవు దినంగా ప్రకటించాయి. ఇదే రోజున తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాకాలైంది.

జనవరి 22న అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్ దేశమే కాకుండా.. ప్రపంచంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు. శతాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల సాకారమవుతున్న మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి 22న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఆఫ్ డే సెలవు ప్రకటించింది.

 Ayodhya Ram Mandir Live Updates 2024 : అయోధ్య రామ జన్మభూమి కేసులో..ఒకేఒక్క‌డు.. కళ్లు ఉండి చేయలేని పనిని.. కళ్లు లేని ఈ స్వామీ..

తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవు.. ?

బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని.. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి రోజు.. హర్యానా, చత్తీస్ గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో హాఫ్ డేను అధికారిక సెలవుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో శ్రీనివాస్ కోరారు. కాగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

అలాగే రాష్ట్ర బీజేపీ నేతలు సైతం జనవరి 22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

#Tags