Students without Cellphones: విద్యార్థులు సెల్‌ఫోన్‌లు వాడుకూడదని అవగాహన పెంచాలి..!

ఇంటినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఎస్టీఎఫ్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వింప్‌ డైరెక్టర్‌. సమావేశంలో మాట్లాడుతూ..

సాక్షి ఎడ్యుకేషన్‌: నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒత్తిడిలేని విద్యను అందించి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూడాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు, వింప్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ సూచించారు. కడప ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన (ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్‌) ఎస్టీఎఫ్‌ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Exams Schedule: మార్చిలో అకడమిక్‌ పరీక్షలు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు సెల్‌ఫోన్‌లు వాడకూడదని అవగాహన కల్పించాలన్నారు. ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాజుయాదవ్‌, రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ మురళీ, జిల్లా గౌరవాధ్యక్షుడు ఆవుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర, ట్రెజనరర్‌ శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్న క్రిష్ణారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి క్రిస్టఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags