School Arrangements: సెలవుల సమయంలో వసతుల ఏర్పాట్లు..!

ప్రస్తుతం పాఠశాలల్లో వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అయితే, తరగతి గదుల్లో కావాల్సిన వసతులు, పాఠశాల సమయంలో ఉండాల్సిన వసతులన్నింటిని తిరిగి ప్రారంభం అయ్యేలోగా ఈ పనులను ముగియ్యాలని తెలిపారు. ఏర్పాట్లపై పూర్తి వివరణ ఇచ్చారు కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌..

 

నాగర్‌కర్నూల్‌: వేసవి సెలవులు ముగిసేలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. కొత్తగా ఏర్పాటైన అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై సోమవారం కలెక్టరేట్‌లో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 839 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు ద్వారా మంజూరైన పనులన్నింటికీ అంచనాలు రూపొందించాలన్నారు.

DEO Radhakishan: మార్కులను ఆన్‌లైన్‌ చేయండి

కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో బ్లాక్‌ బోర్డు, కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లతోపాటు చిన్నపాటి మరమ్మతు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరా తదితర పనులను స్థానికంగానే పూర్తి చేయించాలన్నారు. ప్రతి పాఠశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేసిన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పనులన్నీ వేసవి సెలవుల కంటే ముందుగానే పూర్తిచేసేలా చూడాలన్నారు. ప్రతి పని మొదలు పెట్టే ముందు.. పూర్తయిన తర్వాత ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Tourism Courses: టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags