April Month Holidays 2024 For Schools and Colleges : పండగే పండగ.. సెలవులే సెలవులు.. ఏప్రిల్‌లో స్కూల్స్, కాలేజీ, ఆఫీస్‌లకు భారీగా హాలిడేస్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
ఏప్రిల్ నెలలో మొత్తం కలిపి దాదాపు 10 రోజులకు పైగా స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లకు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ నెలలోనే ముఖ్యమైన రంజాన్, శ్రీరామనవమి, ఉగాది, అంబేడ్కర్ జయంతి లాంటి పండగలు ఉన్నాయి. అలాగే ఈ నెలలో నాలుగు ఆదివారాలు ( ఏప్రిల్ 7, 14, 21, 28) ఉన్నాయి. ఆదివారాలలో సాధారణంగా సూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లు హాలిడేస్ ఉన్న విషయం తెల్సిందే. అలాగే ఏప్రిల్ 13వ తేదీ రెండో శనివారం, ఏప్రిల్ 27వ తేదీ నాల్గో శనివారం చాలా స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవులు ఉన్న విషయం తెల్సిందే.
పండగే పండగ..సెలవులే సెలవులు..
ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. వీటితో పాటు.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు వరుసగా పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అలాగే కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.
ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) ఉగాది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు ఆఫీస్‌లకు సెలవులు ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీ రంజాన్ (బుధవారం) ఈ రోజు అన్ని స్కూల్స్, కాలేజీలు ఆఫీస్‌లకు సెలవులు ఉంటుంది. అలాగే ఏప్రిల్ 17వ తేదీన (బుధవారం) శ్రీరామనవమి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలు ఆఫీస్‌లకు హాలిడే ఉంటుంది. అలాగే ఇదే నెలలో స్కూల్స్ విద్యార్థులకు మరో శుభవార్త ఏంటంటే.. వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద ఈ నెలలో స్కూల్స్ విద్యార్థులకు దాదాపు 14 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
ఈ నెలలోనే స్కూల్స్ విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..
2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్ వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ వేసవి సెలవులను మార్చి 31వ తేదీ నుంచి మే 31, 2024 ఇచ్చిన విషయం తెల్సిందే.
ఈ ఏప్రిల్ బ్యాంక్ సెలవులకు కూడా భారీగానే సెలవులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
2024లో సెలవుల పూర్తి వివరాలు ఇవే...
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
ఏప్రిల్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా ఇలా..
☛ ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు.
☛ ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
☛ ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
☛ ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే)
☛ ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే.
☛ ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్‌లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్
☛ ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే
☛ ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో శ్రీరామ నవమి
☛ ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే
☛ ఏప్రిల్ 21- ఆదివారం
☛ ఏప్రిల్ 27- నాలుగో శనివారం
☛ ఏప్రిల్ 28- ఆదివారం