INSPIRE Manak Awards : ఇన్‌స్పైర్ మ‌న‌క్ 2025 అవార్డ్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు..

భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్‌ (ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ పర్సూ్యట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌) మనక్‌ అవార్డ్స్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు
➤  ది ఇన్‌స్పైర్‌ మానక్‌ (మిలియన్‌ మైండ్స్‌ అగ్‌మెన్‌టింగ్‌ నేషనల్‌ యాస్పిరేషన్స్‌ అండ్‌ నాలెడ్జ్‌), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌–టెక్నాలజీ(డీఎస్‌టీ) నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) సంయుక్తంగా ఈ అవార్డ్స్‌ను అందజేస్తున్నాయి.
➤  ఉన్నత పాఠశాలల నుంచి ఐదుగురిని, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ముగ్గురిని చొప్పున నామినేషన్లను స్వీకరిస్తారు. 
➤  ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న పాఠశా­ల విద్యార్థులలో సృజనాత్మకత, వినూత్న ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడానికి, సైన్స్, సామాజిక అనువర్తనాల్లో ఒక మిలియన్‌ అసలై­న ఆలోచనలు, ఆవిష్కరణలæ లక్ష్యమే దీని ఉద్దేశం.
➤  అర్హత: 10 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 
➤  ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. పాఠశాల అథారిటీని క్లిక్‌ చేసి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసి, పాఠశాల వివరాలను పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈమెయిల్, యూజర్‌ ఐడీతో లింక్‌ రాగానే పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. దీని తర్వాత ప్రాజెక్ట్‌ నమూనాకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపర్చాలి.
ముఖ్య సమాచారం
➤    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➤    దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2024.
➤    దరఖాస్తులకు చివరితేది: 15.09.2024.
➤    వెబ్‌సైట్‌: www.inspireawardsdst.gov.in

NEET UG 2024 Paper Leak : నీట్‌ యూజీ–2024 సుప్రీం కోర్టులో విచారణ నేడే!

#Tags