Skip to main content

Job Mela: రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 5వ తేదీ తేదీ జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది.
Job Mela in Andhra Pradesh at Vijayawada  Job fair announcement in Vijayawada East NTR district job fair date November 5  Employment opportunities for youth in Vijayawada

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపె నీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు న‌వంబ‌ర్ 5వ తేదీ (మంగళవారం) జాబ్ మేళా జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉదయం పది గంటల నుంచి ఈ జాబ్ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 

ముత్తూట్ ఫిన్ కార్ప్, ఎస్బీఐ పేమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో పాటుగా మరికొన్ని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 18 నుంచి 35 ఏళ్ల లోపువారు అర్హులని వివరించారు.  ఎంపికైన వారికి నెలకు రూ.12,000/- నుంచి రూ.35,000/- వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తార‌న్నారు.

ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ ద్వారా వివ‌రాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93477 79032 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

Good News Schools Holiday 2024 : న‌వంబ‌ర్ 7వ తేదీన స్కూల్స్‌, కాలేజీలు సెలవు ప్ర‌క‌టించిన‌ ప్ర‌భుత్వం.. 15వ తేదీన కూడా...!

Published date : 04 Nov 2024 03:08PM

Photo Stories