Applications for KGBV Admissions : కేజీబీవీలో 6, 12వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు.. రేపే ప్రారంభం..

నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 11వ తరగతి (ఇంటర్మీడియెట్) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ టి.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 7, 8, 9, 10, 12వ తరగతుల్లోనూ మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను https//apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. వివరాలకు 97041 00406, 94406 42122 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags