APAAR Cards : వన్ నేషన్ వన్ స్డూడెంట్ ఐడెంటిటీ కార్డు అపార్..
ఓబులవారిపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అపార్ ఐడీ కార్డులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముక్కవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అపార్ ఐడీ కార్డులకు సంబంధించి పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
Job Mela: జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
అనంతరం ఆయన మాట్లాడుతూ 2020 జాతీయ విద్యా విధానం ప్రకారంగానే వన్ నేషన్ వన్ స్డూడెంట్ ఐడెంటిటీ కార్డు అపార్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థులకు అన్ని విధాలా ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags