AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌తం వైభవంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి పండ‌గ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటుంది. తెలంగాణ‌లో కంటే.. ఏపీలోనే సంక్రాంతి పండ‌గ ఘ‌నంగా జ‌రుపుకుంటారు.

ఈ వ‌చ్చే ఏడాది 2024లో సంక్రాంతి పండ‌గ‌కు ఏపీ ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు ఇచ్చారు. ఎవ‌రికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి సెల‌వులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి. 

జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి..
జ‌న‌వ‌రి 13వ తేదీన రెండో శ‌నివారం చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 14వ తేదీన భోగి పండ‌గ.. ఆదివారం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి పండ‌గ‌.. సాధార‌ణంగా సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 16వ తేదీన ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నం సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీల‌కు దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీల‌కు సెలవులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌తి ఏడాది సాధార‌ణంగా జనవరి నెల‌లో స్కూల్స్, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు భారీగా సెలవులు వ‌స్తున్న విష‌యం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. 2024 న్యూ ఇయర్ సోమ‌వారం వ‌చ్చింది. దీంతో న్యూ ఇయర్‌కి వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. ఎలా అంటే.. డిసెంబ‌ర్ 31 ఆదివారం.. జ‌న‌వ‌రి 1వ తేదీ సోమ‌వారం.. ఈ ప్ర‌కారంగా వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

ఇదే నెల‌ జ‌న‌వ‌రి 26 తేదీన రిపబ్లిక్ డే సైతం ఉన్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే. రిపబ్లిక్ డే శుక్ర‌వారం వ‌చ్చింది.. స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు ఈ సెల‌వును ప్ర‌భుత్వం అధికారికం ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌కారంగా చూస్తే.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఈ  ఈనెల నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శ‌నివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెల‌లో రానున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జ‌న‌వ‌రి నెల‌లో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

AP Holidays 2024 Details List : 

☛ కింది లింక్‌ను క్లిక్ చేయండి

☛ Link: www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k (Click Here)

#Tags