Skip to main content

Schools Holidays : రేప‌టి నుంచి స్కూల్స్‌కు క్రిస్మస్ సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే.. ?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌కి సెల‌వులు రేప‌టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ‌కు డిసెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ (క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి) వరకు ఉంటాయి. మిగిలిన‌ స్కూళ్లకు క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా రెండు రోజులు పాటు.. అన‌గా.. డిసెంబ‌ర్ 25, 26వ తేదీన‌ సెల‌వులుంటాయి.
Christmas Break for Missionary Schools  Special Holidays for Christmas Missionary Schools  Schools Closed for Christmas Celebration

దీంతో స్కూళ్లకు డిసెంబ‌ర్ 24వ తేదీ(ఆదివారం), 25వ తేదీ(క్రిస్మస్), 26వ తేదీల్లో(బాక్సింగ్ డే) సంద‌ర్భంగా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.  అలాగే డిసెంబ‌ర్ 26వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం సాధార‌ణ సెల‌వుల జాబీతాలో చేర్చింది.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

బ్యాంకులే కాదు, ప్రైవేట్, ఇతర రకాల బ్యాంకులు కూడా ఆ రోజున..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు కూడా క్రిస్మస్, బాక్సింగ్ డేన సెలవులు పాటించనున్నాయి. డిసెంబర్‌లో.. క్రిస్మస్, బాక్సింగ్ డే కాకుండా, నెలలో ఐదు ఆదివారాలు ఉన్నందున పాఠశాలలు కనీసం ఏడు రోజులు మూసివేయబడతాయి. డిసెంబర్ 25న, క్రిస్మస్ సెలవుల కారణంగా బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్, ఇతర రకాల బ్యాంకులు కూడా ఆ రోజున మూసివేయబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 'హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్' ఈ కింద సెలవు ప్రకటించింది.

 AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

AP Holidays 2024 Details List : 

ap school holidays list 2024ap school holidays list 2024 news

2024 తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. 

Telangana Govt Release 2024 Holidays List  Telangana Government New Year Holiday Announcement

మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు, మార్చి 8న మ‌హా శివ‌రాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి, జూన్ 17న బ‌క్రీద్, సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి, అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులుగా పేర్కొంది. ఈ సారి సంక్రాంతి, ద‌స‌రా, క్రిస్టమస్ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు రానున్నాయి. అయితే 2024 ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, అక్టోబ‌ర్ నెల‌లో ఎక్కువ రోజులు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే భారీ వాన‌లు, బంద్‌ల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోని సెల‌వులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. 

 

telangana schools and colleges holiday 2024 list

 

ts holidays news telugu
Published date : 21 Dec 2023 01:30PM

Photo Stories