AP ICET 2024 Counselling : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌.. షెడ్యూల్ ఇలా!

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన ఏపీ ఐసెట్‌–2024 కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది.

గుంటూరు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన ఏపీ ఐసెట్‌–2024 కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ రిజిస్ట్రేషన్‌ జరగనుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం నుంచి ఆగస్టు 3 వరకు జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఐసెట్‌–2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది.

Andhra Pradesh Govt: ఏపీలో రూ.100 రాబడి.. రూ.113 ఖర్చు..!

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుతో ప్రక్రియ మొదలు

ఏపీ ఐసెట్‌–2024లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు శనివారం నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు apsche.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందు కోసం ఏపీ ఐసెట్‌ హాల్‌ టికెట్‌ నంబరు, ర్యాంకు కార్డు వివరాలతో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి.

● ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజును తిరిగి ఇదే వెబ్‌సైట్‌లో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఐసెట్‌ డీటైల్డ్‌ నోటిఫికేషన్‌, యూజర్‌ మాన్యువల్‌, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్‌లో పొందుపర్చారు.

Bonila Aryan Roshan: నిరుపేద కష్టం తీరింది.. ఐఐటీ విద్యార్థికి కలెక్టర్‌ చేయూత

● విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. రిజిస్ట్రేషన్‌ అనంతరం శనివారం నుంచి ఇది ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఆంగ్లో ఇండియన్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థుల ధ్రువపత్రాలను విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో భౌతికంగా పరిశీలిస్తారు.

ఆగస్టు 7 వరకు వెబ్‌ ఆప్షన్లు

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆగస్టు 4,5,6,7వ తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. ప్రైవేటు ఇంటర్నెట్‌ కేంద్రాలతో పాటు ఇంట్లో నుంచే కంప్యూటర్‌ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లోనూ ఆప్షన్ల నమోదుకు యాజమాన్యాలు సహాయ, సహకారాలు అందించనున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న ఆప్షన్లను తిరిగి మార్చుకునేందుకు ఆగస్టు 8న తుది అవకాశం ఉండగా, ఆగస్టు 10న సీట్ల కేటాయింపు జరగనుంది. గుంటూరు జిల్లాలో ఏఎన్‌యూతో పాటు ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 10 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలల సామర్‌ాధ్యనికి అనుగుణంగా ఇన్‌టేక్‌లో 60, 120 చొప్పున ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఉన్నాయి.

Shiksha Saptah : శిక్షా సప్తాహ్‌లో విద్యార్థుల నైపుణ్యాల‌కు అభినంద‌న‌లు..

#Tags