Government Clarity : సంక్రాంతి సెల‌వులపై ప్ర‌భుత్వం క్లారిటీ ఇదే..!

సంక్రాంతి సెల‌వులపై విద్యార్థుల‌కు క్లారిటీ ఇచ్చింది ప్ర‌భుత్వం..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీలోని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు విష‌యంలో గ‌త కొద్ది రోజులుగా వెనువెంట‌నే సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. అయితే, వారికి ఈ సెల‌వుల కార‌ణంగా సంక్రాంతికి ఇచ్చే సెల‌వుల‌ను ప్ర‌భుత్వం స‌ర్దుబాటు చేస్తార‌నే వార్త బాగా పుకార్లు పుట్టించింది. ఇదే నిజం అని అనుకున్నారు చాలామంది విద్యార్థులు.

January Schools and Colleges Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు ఇంతేనా..? కానీ వీళ్ల‌కు మాత్రం...

ఏపీలో సంక్రాంతి పండుగ కీల‌కం కావ‌డంతో ప్ర‌తీ ఏటా అక్క‌డి విద్యాసంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం క‌నీసం 10 (ప‌ది) రోజులు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తుంది. కాని, ఈసారి వ‌చ్చిన వాన‌లు, వ‌ర‌ద‌లు, బంద్‌ల కార‌ణంగా అనేక సార్లు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు దొరికాయి. అయితే, దీంతో ఈసారి సంక్రాంతికి సెల‌వుల‌ను త‌గ్గుతాయి అన్న వార్త‌ల‌పై ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. 

Bad News for Students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్‌.. ఈ సెల‌వుల్లో కుదింపు.. ఇదే కార‌ణం!!

ప్ర‌భుత్వం క్లారిటీ..

ఏపీలో సంక్రాంతి సెల‌వుల విష‌యంపై క్లారిటీ ఇచ్చింది అక్క‌డి ప్ర‌భుత్వం. దీనిపై వ‌స్తున్న వార్త‌లేమీ న‌మ్మోద్దు అని ప్ర‌భుత్వ స్ప‌ష్టం చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారి ఈ మెర‌కు తెలిపారు. 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. దీంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ విద్యాశాఖ క్లారిటీతో విద్యార్థులు ఈసారి సెల‌వులు ఎన్ని వ‌స్తాయి అని ఎదురు చూస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags