AU Notification : ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. ఉద్యోగం చేస్తూ కూడా..
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రా యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్‌లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే వివరాలను పరిశీలించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు అధికారులు. ప్రస్తుతం, ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకాం, ఎంకామ్, ఎంఏ(పోలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జర్నటిజం, ఇంగ్లీష్, హెచ్ఆర్ఎం.) వంటి కర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తుంది ఏయూ.
Half Day Schools : నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఎప్పటివరకు అంటే..!!
ఏయూకు న్యాక్ ఏ++
విద్యార్థులు ఈ కోర్సులో చేరి, పూర్తి స్థాయిలో చదువుకోవడం లేదా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటివద్దే ఉండి చదువుకునే వీలును కల్పిస్తుంది ఏయూ. 100 సంవత్సరాలకుపైగా సుదీర్ఘ అనుభవం, రెగ్యులర్ స్టడీస్‌తో సమానమైన అవకాశాలు, నాణ్యమైన విద్య, ఇతర నైపుణ్యాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు. ఇక, ఆంధ్రా యూనివర్సిటీకి న్యాక్ ఏ++ ప్రకటించగా.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆలిండియా 25వ ర్యాంకు సాధించింది ఏయూ. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందాలనుకుంటే, 9390707950 ఈ నంబర్‌ను సంప్రదించండి. ఈ నంబర్‌కు మేసేజ్ చేయండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)