Law Course : మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్ర‌వేశంపై ఎన్‌ఎల్‌ఎస్‌ఏ డిమాండ్‌

తిరుపతి సిటీ: ఎస్వీయూలో మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ కోర్సును ప్రవేశ పెట్టాలని జాతీయ న్యాయ విద్యార్థుల సంఘం (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సుందరరాజు డిమాండు చేశారు. ఆయన శుక్రవారం ఎస్వీయూ యూత్‌ ఫెస్టివల్‌ ప్రారంభానికి హాజరైన రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లా కళాశాలలు ఉన్నాయని తెలిపారు.

TS Government Jobs Notification 2024 : 1520 ఉద్యోగాలకు నోటిపికేష‌న్‌... ప‌రీక్ష తేదీలు ఇవే...!

వాటిలో ప్రైవేటు కళాశాలల యజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజులకు రెండింతలు అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రెడ్డి మోహన్‌, ఓబీసీ సంఘం అధ్యక్షుడు తిరుమలేష్‌, బీసీ జాక్‌ స్టూడెంట్‌ యూనియన్‌ రాయలసీమ ఇన్‌చార్జి విజయ్‌, యోగేష్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags