RGUKT: ఆర్జీయూకేటీలో ముగిసిన రెండోదశ కౌన్సెలింగ్‌

బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూ­కేటీ)­లో ప్రవేశాలకు జూలై 19న‌ రెండోదశ కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

క్యాంపస్‌లోని అకడమిక్‌ బ్లాక్‌లో విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌­లర్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ ఆదేశాల మేరకు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

కాగా, 82 మంది సాధారణ, క్యాప్‌ కేటగిరీలో 14 మంది, గ్లోబల్‌ కేటగిరీలో ఏడుగురు విద్యార్థులు హాజరయ్యారు. వన­పర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన కావ్యశ్రీకి ఎంపిక ధ్రువపత్రాన్ని జాయింట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పావనితో కలసి అందజేశారు. రెండోదశలో మిగిలిన సీట్లను మూడవ విడతలో భర్తీ చేస్తామని తెలిపారు. దానికి సంబంధించిన జాబితాను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

చదవండి: Triple-IT: ట్రిపుల్‌ ఐటీ దరఖాస్తు నోటిఫికేషన్ విడుద‌ల‌.. ప్రవేశార్హతలు, వయస్సు, అడ్మిషన్లు విదానం ఇలా..

గ్లోబల్‌ కోటా స్వరాష్ట్రం సీట్లను సైతం భర్తీ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తేదీలను ఖరారు చేస్తామన్నారు.

వివరాలకు  www.rgukt.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కౌన్సెలింగ్‌ ప్ర­క్రియలో జాయింట్‌ కన్వీనర్లు రంజిత్‌కు­మార్, డాక్టర్‌ దత్తు, అడ్మిషన్స్‌ కమిటీ సభ్యులు హరి కృష్ణ, సునీత, డాక్టర్‌ కుమార్‌ రాగుల, శ్రీకాంత్, రాకేశ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

#Tags