Skip to main content

B Tech Admissions : ఏపీ ఈఏపీసెట్ 2024 కౌన్సెలింగ్ పూర్తి.. అడ్మిష‌న్లు ప్రారంభం..

End of AP EAPCET 2024 counselling and start of B Tech Admissions

తిరుపతి: ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో గురువారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ ఈఏఎంసెట్‌–2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 16తో పూర్తి కావడంతో ఆన్‌లైన్‌లో బుధవారం మొదటి దశ సీట్లు కేటాయించారు. దీంతో విద్యార్థులు తమకు నిర్దేశించిన కళాశాలలో అడిష్మన్లు పొందుతున్నారు. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనుంది.

AP EAPCET 2024 Counselling : ముగిసిన ఏపీఈఏపీసెట్ తొలి విడ‌త కౌన్సెలింగ్.. నేటి నుంచే త‌ర‌గ‌తులు ప్రారంభం..!

తిరుపతి ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో అన్ని బ్రాంచ్‌లకు కలిపి తొలి రోజు 150మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వర్సిటీలోని కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్స్‌ కమిటీ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. ప్రొఫెసర్లు దివాకర్‌, గౌరీమనోహర్‌, అఖిల స్వతంత్ర పర్యవేక్షణలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Puja Khedkar Case: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్‌.. అభ్యర్థిత్వం రద్దు..

Published date : 19 Jul 2024 05:22PM

Photo Stories