IGRUA Admissions 2024: ఐజీఆర్‌యూఏలో సీపీఎల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
అమేథీ(యూపీ)లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ(ఐజీఆర్‌యూఏ).. సెప్టెంబర్ 2024 సెషన్ కమర్షియల్ పైలట్ లైసెన్స్(సీపీఎల్) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

మొత్తం సీట్ల సంఖ్య: 125.
కోర్సు వ్యవధి: 24 నెలలు.
అర్హత: కనీసం 45శాతం మార్కులతో 10+2(ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కనీసం 158సెం.మీ.ఎత్తు ఉండాలి.
వయసు: 17 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వైవా/ఇంటర్వ్యూ, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.05.2024
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 24.05.2024
ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 03.06.2024.
ఇంటర్వ్యూ/వైవా ప్రారంభం: 16.07.2024.
వెబ్‌సైట్: https://igrua.gov.in/
Published date : 11 Apr 2024 03:47PM