Admissions: ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు..
Sakshi Education
తిరుపతి జిల్లా: ఏపీ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ నారాయణరావు తెలిపారు. కోట బాలుర పాఠశాలలో 120 సీట్లు, దొరవారిసత్రంలో 80, సత్యవేడులో 80, ఐతేపలిలో 40, వెంకటగిరిలో 40, గూడూరు బాలికల పాఠశాలలో 40, ఉదయమాణిక్యంలో 80 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈనెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 9866559643లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Published date : 04 Mar 2024 10:50AM