Pranjali Awasthi Success Story : చిన్న వయస్సులోనే.. రూ.100 కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి.. ఎలా అంటే..?
Pranjali Awasthi అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి. ఈమె Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నారు. ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. చాట్‌జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది.
ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. ఇలాంటి వారు ఎందరో తమ ప్రతిభను చాటి.. వ్యాపార సామ్రాజ్యంలో ముందుకు రాణిస్తున్నారు.
Tags
- pranjali awasthi success story
- pranjali awasthi inspire story
- pranjali awasthi bussiness news
- pranjali awasthi biography
- pranjali awasthi net worth
- pranjali awasthi company
- pranjali awasthi ai startup
- Business Intelligence
- PranjaliAwasthi
- InspirationalStory
- sakshi education success story
- YouthLeadership
- women empowerment