Skip to main content

Michelle Obama Parenting Tips: ఆత్మవిశ్వాసం గల పిల్లలుగా ఎదగాలంటే..ఆ తప్పులు చెయ్యొదంటున్న మిచెల్‌ ఒబామా!

Michelle Obama Parenting Tips Tips from Michelle Obama  Michelle Obama discussing the role of parents as both guides and benefactors in their children's lives.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిచెల్‌ ఒబామా సోషల్‌ మీడియా ఇంటర్యూలో పిలల్ల పెంపకం గురించి మాట్లాడరు. పిల్లలను చక్కగా పెంచడం అనేది ఓ యజ్ఞం లాంటిదని అన్నారు. ఎందుకుంటే మనం చెప్పేవి వాళ్ల మంచికేనని తెలియాలి, అదే టైంలో తల్లిదండ్రులు వాళ్లకు విలన్స్‌ కాదు శ్రేయోభిలాషులు అనే నమ్మకం కలిగించాలి. అంతేగాదు ఆమె పిల్లల పెంపకం అనేది చాలా కష్టమైన పని అని, అది కత్తి మీద సాములాంటిదని అన్నారు.

ఏ మాత్రం మనం అజాగ్రత్తతతో లేదా నిర్లక్ష్యపూరితంగా వ్యహరిస్తే వారి భవిష్యత్తు నాశనమవ్వడం తోపాటు మనకు తీరని మనోవ్యధే మిగిలుతుంది అని చెబుతున్నారు మిచెల్‌. తాను ఈ విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న మెళుకువలే  తన ఇద్దరి పిల్లల పెంపకంలో ఉపయోగపడ్డాయిని చెబుతోంది. అందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మిచెల్‌. అవేంటంటే..

పిల్లలు తమంతట తామే పెరుగుతారు. వారికి ఎదిగే క్రమంలో మన సాయం కావాల్సిన చోటల్లా భరోసా ఇస్తే చాలు. వారే చుట్టూ ఉన్న వాతావరణం, తమ స్నేహితులు, బంధువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. పైగా తెలివిగా అభివృద్ధి చెందుతారు. ఆ క్రమంలో పిలల్లు కొన్ని తప్పులు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది తప్పు, ఇది కరెక్ట్‌ అనేంత మెచ్చూరిటీ లెవెల్స్‌  పిలల్లకు ఉండవు.

మనం చేసే ఒక్కో పని సంక్రమంగా లేకపోతే ఎంత పెద్ద సమస్యను సృష్టిస్తుందనేది కూడా వాళ్లు అంచనా వేసేంత బ్రెయిన్‌ వాళ్లకు ఉండదు. కాబట్టి పిల్లలను తెలివిగా, సక్రమంగా పెంచాలంటే ఈ సింపుల్‌ మెళుకువలు పాటిస్తే ఎంతటి మొండి పిల్లలైనా తీరు మార్చుకుంటారు. కాస్త సమయ తీసుకున్నప్పటికీ మంచి పిల్లలుగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. 

మిచెల్‌ చెప్పే మెళుకువలు..

పిల్లలను నేరుగా విమర్శించొద్దు..
చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఇదే అని మిచెల్‌ అంటున్నారు. మీరు పిల్లలను మంచి కోరే నేరుగా వాళ్ల చేస్తుంది తప్పు అని చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు మనం అన్నమాటలు ఎలా తీసుకుంటున్నారనేది గమనించకపోతే పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య ఉండే బాండింగ్‌ దెబ్బ తింటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు తమ తప్పును వాళ్లే గుర్తించేలా విడమర్చి చెబుతూ మిమర్శనాత్మకంగా చెప్పండి. అంతేగాదు పేరెంట్స్‌ మీరు క్షమించినా, బయట ఇలా చేస్తే వాళ్లను ఎలా చూస్తారనేది అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు పేరెంట్స వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా ఫ్రెండ్లీగా మెలుగుతారు. 

బాధ్యతలను తీసుకునేలా చేయాలి..
చాల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని మిచెల్‌ అంటున్నారు. పిల్లలు అమాయకులు, ఎంత ఎదిగినా చిన్నవాళ్లే అనే భావనల నుంచి పేరెంట్స్‌ ముందు బయటకు రావాలి. వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కారించాలనే ఆలోచన డెవలప్‌ అవుతుంది.

ఇలాంటప్పుడే వాళ్లలోని దాగున్న ప్రతిభ, సామర్థ్యాలను బయటకు వస్తాయి. ఇక్కడ బాధ్యతలు అనగానే ప్రతీది కాదు వారు చేయగలిగేలా, ప్రయోజనం చేకూర్చేవి, తప్పక నేర్చుకోవాల్సిన బాధ్యతలు చిన్న చిన్నగా ఇవ్వండి. రాను పిల్లలకు తెలియకుండా నా కుటుంబం కోసం నేను ఇది చేయాలనే అవగాహన రావడమే గాక ఇది తన బాధ్యత అనే స్థాయికి చేరుకుంటారని అంటున్నారు మిచెల్‌. 

సమస్యలతో పోరాడనివ్వండి..
తల్లిదండ్రులుగా మనం రక్షణగా ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా ఏదోఒక సమయంలో వారికి వారే పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల చిన్న సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారో చూడండి. వెళ్తున్న దారి కరెక్టే అయితే ధైర్యం ఇవ్వండి. ఒకవేళ్ల తప్పుదోవలో సమస్య పరిష్కరించేందుకు చూస్తుంటే అడ్డుకుని వివరించండి. ఈ విధానం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కెరీర్‌ పరంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను జయించగలిగే శక్తిని ఇస్తుంది . 

తప్పిదాల నుంచే విజయం పొందడం ఎలా..?
ఒక పని చేస్తున్నప్పుడూ పదే పదే ఫెయ్యిల్యూర్లు వస్తుంటే.. అక్కడితో నిరాశగా ఢీలా పడిపోకుండా ముందుకు నడవడం ఎలా అనేది తెలియజేయండి. ఎన్ని ఓటములు ఎదురైనా.. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ని వదలకూడదు, ఓడిపోయానని చేతులెత్తేయకూడదని చెప్పండి. చివరి నిమిషం వరకు విజయం కోసం వేచి చూసే స్పూర్తిని నేర్పించండి. తప్పిదాలనే విజయానికి బాటలుగా చేసుకోవడం ఎలా అనేది వివరించండి. ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తుల గూర్చి కథకథలుగా చెప్పండి. అప్పుడూ వాళ్లకు సక్సెస్‌ అనేది అందుకోలేని బ్రహ్మపదార్థంలా కనిపించదు. 

అలాగే ప్రస్తుత పరిస్తుతలను చూసి చాలామంది తల్లిదండ్రులు మనోడు మంచిగా ఉంటాడా? అని ఆందోళన చెందకూడదు. నిజానికి బయట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మీరు వారితో వ్యవహరించే విధానం బాగుంటే ఆందోళనకి చోటు ఉండదనే విషయం గుర్తెరగాలి. అంతేగాదు చెడు అలవాట్ల జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనసు లాగినా పేరెంట్స్‌ మీదున్న గౌరవం ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తుంది అని చెబుతున్నారు. నిజంగా మిచెల్‌ చెప్పిన మెళుకువలు ప్రతి తల్లిదండ్రులు అనుకరిస్తే పిల్లలు మంచిగా పెరగడమే కాకుండా దేశానికి మంచి పేరు కూడా తెస్తారు కదూ. 

Published date : 23 Feb 2024 01:48PM

Photo Stories