Skip to main content

Roku lays off: 200 మందిని ఇంటికి సాగ‌నంపిన అమెరికా కంపెనీ.... త‌లలు ప‌ట్టుకుంటున్న ఉద్యోగులు

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ స్ట్రీమింగ్ రోకు ఉద్యోగుల తొల‌గింపును మ‌రోసారి చేప‌ట్టింది. ఇప్ప‌టికే గ‌త నవంబ‌ర్‌లో 200 మందిని తొల‌గించిన ఆ సంస్థ‌... తాజాగా మ‌రో 200 మందిని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. క్యూ2లో స్ట్రీమింగ్ బాక్సుల విక్రయం భారీగా ప‌డిపోయింది. ఇది కంపెనీ ఆదాయంపై ప్ర‌భావం చూపింది.
Streaming company Roku
Streaming company Roku

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా... 150 కంపెనీల‌కు అప్లై చేస్తే...!

400 మందిని తొల‌గించిన కంపెనీ
రోకు అనేది అమెరికాకు చెందిన కంపెనీ. సెటాప్ బాక్సు కంపెనీ ఇది.. అలాగే డిజిట‌ల్ ప్ర‌సారాలను అందిస్తుంది. క‌రోనా నేప‌థ్యంలో 2021లో భారీగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టింది. 2022 చివ‌రికి ఈ కంపెనీలో సుమారు 3600 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డంతో ఉద్యోగాల‌పై వేటు వేసేందుకు రోకు సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 400 మందిని తొల‌గించిన‌ట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డించింది.

చ‌ద‌వండి: ఏడ‌బ్ల్యూఎస్ వారికి భారీగా దెబ్బ‌... అమెజాన్‌లో 9 వేల మందికి ఊస్టింగ్‌
ఉద్యోగ‌స్తుల బాధ వ‌ర్ణ‌నాతీతం...

ఆర్థిక మంద‌గ‌మ‌నంతో అమెరికా అల్లాడిపోతోంది. ఇప్ప‌టికే ఆ దేశంలో రెండు బ్యాంకులు దివాళా తీశాయి. మెటా, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగాల‌ను తొల‌గిస్తున్న నేప‌థ్యంలో చిన్న కంపెనీలు కూడా ఆ బాట‌నే ఎంచుకున్నాయి. ఏదిఏమైనా ఉద్యోగాల‌కు భారీగా కంపెనీలు కోత విధిస్తుండ‌డంతో ఉద్యోగ‌స్తులు నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌పాల్సిన దుస్థితి నెల‌కొంది.

Published date : 31 Mar 2023 03:41PM

Photo Stories