Skip to main content

Layoffs: ఏడ‌బ్ల్యూఎస్ చేసిన వారికి భారీగా దెబ్బ‌... అమెజాన్‌లో 9 వేల మందికి ఊస్టింగ్‌

ఉద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ షాకివ్వనుంది. రానున్న వారాల్లో సుమారు 9 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వారిలో ఏడబ్ల్యూఎస్‌, అమెజాన్‌ అడ్వటైజింగ్‌, ట్విచ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి తెచ్చాయి. ఇక లేఆఫ్స్‌పై అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపారు. ఆ మెయిల్స్‌లో తొలగింపుల నిర్ణయం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Amazon
Amazon

18వేల మంది ఉద్యోగుల తొలగింపు
గతేడాది నవంబర్‌లో అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్‌ People eXperience and Technology (PXT)కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని అమెజాన్‌ ఫైర్‌ చేసింది. తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.  

చ‌ద‌వండి: హాఫ్‌ జీతానికే ప‌నిచేయండి... లేదంటే.. ప్రెష‌ర్స్‌కు ఐటీ కంపెనీ భారీ షాక్‌​​​​​​​
మెటాలో 10 వేల మంది...

ఆర్ధికమాంద్యం ముందస్తు భయాల నేప‌థ్యంలో మెటా 10 వేల మంది సిబ్బందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్ప‌టికే 11వేల మందిని ఫైర్‌ చేసింది మెటా.

Published date : 21 Mar 2023 06:31PM

Photo Stories