Skip to main content

రేపు మహా జాబ్‌మేళా

30,000+Job mela, Rajamandry, 500 companies.
Job mela

కొత్తపేట: రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల (అటానమస్‌)లో ఈ నెల 11, 12 తేదీల్లో మహా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేపీ రాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు నిర్వహించే ఈ జాబ్‌మేళాకు 500 కంపెనీలు వస్తుండగా సుమారు 30 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిధిలోని 4 నోడల్‌ రిసోర్స్‌ సెంటర్ల (ఎన్‌ఆర్‌సీ) కళాశాలల పరిధిలోని 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఈ జాబ్‌మేళాలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు.

శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల, తాడేపల్లిగూడెం ప్రభుత్వ కళాశాల పరిధిలోని 20 కళాశాలల విద్యార్థులకు, శనివారం కాకినాడ పీఆర్‌ కళాశాల, తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిధిలోని 20 కళాశాలల విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహా జాబ్‌మేళాకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఐడీ కార్డు, యూనిఫామ్‌, 3 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, రెజ్యూమ్‌, ఆధార్‌కార్డుతో పాటు అకడమిక్‌ సర్టిఫికెట్స్‌ 3 సెట్లు జిరాక్స్‌ కాపీలతో తీసుకురావాలని సూచించారు.

ఈ జాబ్‌మేళాకు వెళ్లే అభ్యర్థులకు రవాణా, భోజన సదుపాయాలు కళాశాల తరపున కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి శనివారం 127 మంది విద్యార్థులను రెండు బస్సుల్లో తీసుకువెళ్తున్నట్టు ప్రిన్సిపాల్‌ కేపీ రాజు తెలిపారు.

Published date : 12 Aug 2023 10:06AM

Photo Stories