Employees Fire: తపాలా ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి ఎడ్యుకేషన్: తపాలా శాఖ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా మారింది. అందులోని ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఐదు దశాబ్దాలుగా వారి జీతాల్లో ఏమాత్రం మార్పు లేకపోవడంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారికి గ్రామీణ తపాలా ఉద్యోగులుగా (జీడీఎస్) కేంద్ర తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. ఇందులో చేరే ఉద్యోగులకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,800 మంది జీడీఎస్ ఉద్యోగులు ఉండగా, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1600 మంది పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కదా.. మంచి భవిష్యత్ ఉంటుందనే ఆశతో చేరిన వారికి చివరకు నిరాశే మిగులుతోంది.
Meta Layoffs: ఐటీలో మళ్ళీ ఉద్యోగుల తొలగింపు
ఎన్నెన్నో సేవలందిస్తూ..
గ్రామీణ తపాలా ఉద్యోగులు(జీడీఎస్) ఉదయం, సాయంత్రం వేళల్లో విధులు నిర్వర్తిస్తారు. ఎస్‌బీ, ఆర్డీ, టీడీ, ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌పీఎల్‌ఐ, ఏపీ రెగ్స్ లావాదేవీలు ప్రతి రోజూ నిర్వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, పార్సిల్ మనీ ఆర్డర్ వంటి సేవలు అందిస్తారు. ఐపీపీబీ(ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్) లావాదేవీలు కూడా జరుపుతారు. ఏఈపీఎస్ ద్వారా ఇతర బ్యాంకుల విత్ డ్రాయల్స్ కూడా అందిస్తుంటారు. ఈ లావాదేవీలకు సంబంధించి కేవలం నామమాత్రపు కమిషన్ రూ.100 లేదా రూ.200 మాత్రమే అందిస్తారు. అయితే కమిషన్ మాకొద్దు.. పనిభారం తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Success Achievement: ఉద్యోగానికి సెలవు.. ఎస్ఐగా ఎంపిక
ఆందోళనలు చేసినా.. ఫలితం లేక..
తమకు పని భారం తగ్గించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, మార్కెట్ ధరలకనుగుణంగా జీతాలు పెంచాలని అనేక పర్యాయాలు ఆందోళనలు నిర్వహించినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. పోరాటం ఉధృతిలో భాగంగా బుధవారం ఒక రోజు సమ్మెకు ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ పిలుపునిచ్చింది.
Jobs at 108 Service: ఉద్యోగావకాశం.. ఈఎంటీ పోస్టుకు దరఖాస్తులు
బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు ఎవరూ ఆర్‌ఐసీటీ మిషన్లు ఓపెన్ చేయకూడదని గట్టిగా చెప్పింది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల నుంచి బ్యాగులు పంపకూడదు, తీసుకురాకూడదని స్పష్టం చేసింది.