Good News: ఉద్యోగులు, కార్మికులకు వీసా ఫీజు తగ్గించింది ఈ దేశం
ఒమన్ వాసులకే పెద్దపీట వేసే చర్యల్లో భాగంగా వలస కార్మికుల సంఖ్య తగ్గించుకోవడానికి 2021లో వీసాల ఫీజును భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. వీసాల ఫీజును ఐదింతలు పెంచడం వల్ల విదేశీయులపై భా రం పెరిగి నైపుణ్యం ఉన్న కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా విదేశాల నుంచి వచ్చే వారికి తక్కువ ఫీజుకే వీసాలను జారీ చేయనున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటిం చింది. ఇంజనీర్లు, మేనేజర్ స్థాయి ఉద్యోగులకు వీసా జారీ చేయడానికి 2,001 ఒమన్ రియాళ్లు.. అంటే మన కరెన్సీలో రూ.3.97 లక్షలు చెల్లించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వీసాల ఫీజును రూ.59 వేలకు కుదించారు. అంటే కేవలం 301 ఒమన్ రియాళ్లను చెల్లిస్తే సరిపోతుంది. ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా ఇతరత్రా కోర్సులు చేసిన వారు సూపర్‌వైజర్, ఫోర్‌మన్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి వీసాలు అంటే రెం డవ శ్రేణి వీసాల కోసం రూ.1.18 లక్షల నుంచి రూ.1.98 లక్షల ఫీజును నిర్ణయించా రు. ఈ ఫీజును కూడా ఒమన్ ప్రభుత్వం తగ్గించింది. సెకండ్ క్లాస్ వీసాల కోసం రూ.49 వేల ఫీజును వసూలు చేయను న్నారు. అలాగే థర్డ్ క్లాస్ వీసాలు అంటే భవ న నిర్మాణ రంగం, మాల్స్, క్లీనింగ్ రం గంలో కార్మికుల వీసాల కోసం ఉన్న రూ.71 వేల ఫీజును రూ.40 వేలకు తగ్గించారు.
చదవండి:
గుడ్‌న్యూస్: హెచ్-1బీపై బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..భారతీయులకే అత్యధిక ప్రయోజనం
ఏ దేశ ప్రజలకు అత్యవసర వీసాలు జారీ చేస్తామని భారత్ ప్రకటించింది?