Skip to main content

Jobs: వైద్య విధాన్‌ పరిషత్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Apply for Healthcare Positions ,jobs Notification, Arasavalli,21 Vacancies in Healthcare Sector, Recruitment Alert ,
jobs Notification

అరసవల్లి: ఏపీ వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రుల్లో మొత్తం 21 ఖాళీలను కాంట్రాక్ట్‌ /ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ భాస్కరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రాప్తికి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశామని, 8 రకాల పోస్టుల భర్తీ కోసం ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో థియేటర్‌ అసిస్టెంట్‌–7, ల్యాబ్‌ అటెండెంట్‌ –4, ఆఫీస్‌ సబార్డినేట్‌ – 2 పోస్టులను, అలాగే కాంట్రా క్ట్‌ విధానంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ –4 ,ఆడియో మె ట్రీషియన్‌ –1, ఫిజియోథెరపిస్టు– 1, ఎలక్ట్రీషియన్‌ – 1, రేడియోగ్రాఫర్‌ –1 పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ శ్రీకాకుళం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Published date : 02 Sep 2023 09:53AM

Photo Stories